gurajada apparao — దేశమును ప్రేమించుమన్నా .. పూర్తి గేయం.


దేశమును ప్రేమించుమన్నా …
—————————————-
దేశమును ప్రేమించుమన్నా … మంచి అన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయి గట్టి మేల్ తలపెట్టవోయి!

పాడిపంటలు పొంగిపొర్లే దారిలో నువు పాటుపడవోయి
తిండికలిగితే కండకలదోయి కండకలవాడేను మనిషోయి!

ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయి?
జల్దుకొని కళలెల్ల నేర్చుకు దేశి సరుకులు నించవోయి!

పూనుస్పర్థలు విద్యలందే వైరములు వాణిజ్యమందే
వ్యర్థ కలహం పెంచబోకోయి కత్తివైరం కాల్చవోయి!

దేశాభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయి
పూని ఏదైనాను ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయి!

స్వంతలాభం కొంతమానుకు పొరుగువాడికి తోడుపడవోయి
దేశమంటే మట్టి కాదోయి దేశమంటే మనుషులోయి!

చెట్టపట్టాల్ పట్టుకొని దేశస్థులంతా నడువవలెనోయి
అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయి!

మతం వేరైతేను ఏమోయి? మనసులొకటై మనుషులుంటే
జాతమన్నది లేచి పెరిగి లోకమున రాణించునోయి!

దేశమనియెడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలెనోయి
నరుల చమటను తడిసి మూలం ధనం పంటలు పండవలెనోయి!

ఆకులందున అణగి మణగీ కవిత కోయిల పలకవలెనోయి
పలుకులను విని దేశమందభిమానములు మొలకెత్తవలెనోయి!

— గురజాడ అప్పారావు (౧౯౧౦)

— gurajada apparao (1910)

Advertisements
Categories: తెలుగు, indian, sentiment, suggestions, vizianagaram, world | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: