ప్రాణం విలువ


చీమ చిట్టిదైనా చూసి నేర్చుకోవాల్సింది మాత్రం గట్టిదే బాబూ.

చీమ చిట్టిదైనా చూసి నేర్చుకోవాల్సింది మాత్రం గట్టిదే బాబూ.

కన్ను తెరిస్తే జననం, కన్నుమూస్తే మరణం.. కనురెప్పపాటు జీవితం.

ఇంత రొడ్డకొట్టుడు సామెత మరింకొకటి లేదేమో.  కొన్ని వందల సినిమాల్లో, మరికొన్ని వేల పుస్తకాల్లో, లెక్కలేనన్ని వ్యాఖ్యానాల్లో  ఎక్కడ పడితే అక్కడ వాడేసారీ సామెతని.  మాటలొచ్చిన ప్రతి ఎదవా ఒదిలేసాడీ డైలాగ్ ని.  చివరికి ఏం జరిగిందయ్యా అంటే, ఇది విన్నా, చూసినా, చదివినా అసలేం చలనం లేకుండా మొద్దుబారిపొయాయి మన మనసులు.   అదే ఏ ప్రేమో దోమో అంటే మాత్రం  ఠక్కున లేచి కూర్చుంటాడు సగటు ప్రేక్షకుడు.  ఇంక మరి చన్నూ చంకా చూపిస్తే చొంగలు కార్చేసే ప్రజలకి లెఖ్ఖే లేదు. బ్లాకులో కూడా  కొనేస్తారు టిక్కెట్లు.   ఆర్.నారాయణమూర్తి గారి ఆక్రోశం అర్ధంకాని ప్రజలకి, ఇలియానా చింకి గుడ్డలు మాత్రం చాలా నచ్చుతాయి.

సర్లెండి ఇంక అసలు విషయం లోకి వచ్చేస్తాను కాని కొంచెం సమయం ఇవ్వండి  మరి 😉

(contd. part-ii)

చావుపుట్టుకల గురించి కదా మాటా్లడుకుంటున్నాం. తెల్లారి పేపరు తీసే్త చాలు, దోపిడీలు, హత్యలు, ఆత్మహత్యలూను.. ఎక్కడో జరగితే చదవడం వేరు, మనకో, మన కుటుంబంలో ఒకరికో జరగడం వేరు..  పక్కోడికి తగిలితే ఫక్కున నవ్వుతారుగా ప్రజలు, కాని కాలికి తగిలితేనే కదా కెవ్వుమని అరిచేది..  స్పందన సంగతి పక్కనుంచితే,  ఒక మనిషిని సరిగ్గా తూకం వేసి కొలవగలిగేది అతను చూసిన చావు పుట్టుకల సంఖ్యతోనే ఏమోనని అనిపిసూ్తంటుంది అప్పుడప్పుడు..నిజమే.. కరెక్ట్ గా ఆలోచిసే్త …ఓ బిడ్డ పుట్టుక చూసినపు్పడో, మరో మనిషి తుది శా్వసలో పక్కన నించున్నప్పుడో మాత్రమే మనకి వాటి మూలాలు వెతకాలనే బలమైన కోరిక కలుగుతుంది..కాసో్త కూసో్త ఆలోచనలో పడేది అప్పుడే.. ఆ తరా్వత మళీ్ళ అంతా మామూలే అనుకోండి.. కాని  “స్మశాన వైరాగ్యం.. ప్రసూతి వైరాగ్యం” అని ఊరకనే అనలేదు. అనుభవం మీద చెప్తున్నాను.. నా జీవితం నిండా ఎనో్న పిడిగుద్దుల్లాంటి నిష్క్రమణలు, మరెన్నో పూలరేకుల్లాంటి ఆగమనాలు.. కాని రావటం, వెళ్ళటం రెండూ కూడా నన్ను తీవ్రమైన ధా్యనంలో పడేసేవి.  ఎక్కణ్ణుంచొస్తున్నాడో, ఎక్కడికెళ్ళిపోతున్నాడో అన్న సందేహం పక్కన పెడితే, అసలీ కాల చక్రం ఇంత సి్థరంగా, ఇంత సి్థమితంగా.. ఆహ్ఁ వద్దులెండి, ఆపేసు్తన్నాను.

ఇక, విషయంలోకి వచే్చముందు కొంతమంది వ్యక్తులి్న కొద్దిగా అధ్యయనం చేద్దాం.

సూర్రాజు అని నా సే్నహితుడొకడుండేవాడు.  మంచి ఉదో్యగం, ఒద్దికైన భార్య, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలతో చూడచక్కని సంసారం. కాని, ఎలా కుదిరిందో గాని మహమ్మారి వ్యసనం, కాలేయం కుళ్ళిపోతున్నా మందు మానలేకపోయాడు. చివరాఖరికి  పచ్చకామెర్లతో, ఆస్పత్రి మంచం మీద కూడా కక్కురి్త పడ్డాడు..చెత్త కొడుకెవడో పక్కగా తాగుతుంటే, ఆగలేకపోయాడనుకుంటా.. మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు.

రాంబాబని మరో మహా మనిషి.  తండి్ర లేకపోయినా, ఏ లోటూలేకుండా పెంచిందా తల్లి.  సర్కారుదో్యగాల్లో సర్దుకుపోవడాలగురించి వేరేగా చెప్పాలాండీ.. రూపాయి రూపాయి కలుపుకుని సాకిందామె.  అప్పట్లోనే ఆ ఎదవని ఇంగీ్లషు మీడియంలో చేర్పించి, ఎదిగితే చూడాలని ఉవ్విళ్ళూరేది. కాని, రాజావారికి చక్కగా అబ్బినవి మాత్రం పేకాట, మద్యం.  రోడ్డున పడి తిరిగి, ఉన్న కాస్త ఆస్థీ తగలేసాడు.  ఇల్లమే్మసాడు. పెళ్ళి కూడా చేసుకోలేదు. పే్రమించిన అమ్మాయి చెప్పినా చెవికెక్కలేదు కాబట్టి చివరికి తనూ దక్కలేదు. ఆరోగ్యం చెడి, రోజులు లెక్క పెడుతున్నా, ఇప్పటికీ అవే గల్లీల్లో, అదే తరహా ఆ మనీషిది… వాడో విడ్డూరం నాకు.

మోహన్ గాడు మరో వింత భూతం. ఎంచడానికి ఏం లేదు వాడి జీవితంలో.  విపరీతమైన తెలివితేటలు. ఎంతో ఉన్నతమైన ఆలోచనలు. పెద్ద ఉద్యోగం. కాని అయ్యగారికి నిరాశ రోగం. ఈ మధ్య ప్రతి ఒక్కడికీ డిపె్రషన్ పెద్ద ఫ్యాషనైపోయింది కదా.  చిన్న దెబ్బ తగిలినా చాలు, చచ్చిపోతానని పరిగెడతాడు.  మూరీ్తభవించిన మనోదౌర్భల్యం ఎవడంటే వాణ్ణి చూపించచ్చు. ఈమథ్య ఇలాంటి మూరు్తలు మరీ ఎక్కువైపోతున్నారన్నదే నా దుద్ద, అంతే కాని డిపె్రషన్ అన్నది ఒక శారీరక రోగమని, దానిక్కూడా మందుందని నాకు తెలుసనుకోండి., కాకపోతే పిడికిలి, పోరాటం అన్న పదాలు వాడి పదకోశంలో లేవనుకుంటా. ఆత్మహత్య చేసేస్కుని, అవయవాలన్నీ దానం చేసేసా్తనన్నాడొకసారి. కేవలం ఒకేఒక్క బంగారు గుడ్డుకోసం, బాతుని కోసెయ్యటం కాదటండీ అది.  “నీకెవ్వరూలేరనుకుంటే, వెళ్ళి ఓ అనాధని తీసొ్కచ్చి సాకు. కనీసం తనకైనా పనికొసు్తంది నీ పా్రణం” అని చెప్పా.  ఆవును మరి. పా్రణం విలువకీ, అవయవం విలువకీ ఎంత తేడా ఉందండీ. అర్ధం చేసో్కడం సరి తరా్వత నాతో మాటా్లడ్డం మానేసాడు చాలా కాలం.  ఏం చేసినా, ఎంత చెప్పినా వాడిలో ఆత్మవిశా్వసం పెంచలేకపోయానే అన్న బాధ నన్ను ఎప్పటికీ వెంటాడుతుంది. ఫలితం..  ఏ బలహీన క్షణంలో ఎప్పుడు ఏం చేసేసుకుంటాడోనని బెంగ.

చిన్నాగాడిది మరీ విషాదాంతం. చిన్నప్పటి్నంచీ ఒక మరదలి్న చూపించి ఇదే నీ పెళ్ళాం అన్నారు.  పెద్దయ్యాక, నీకు సరైన ఉదో్యగం లేదు గాబట్టి పెళ్లి చెయ్యటం కుదరదన్నారు. క్షణికావేశంలో పురుగులమందు (నువాకా్రన్) తాగేసాడు. (అప్పట్లో చాలా ఘాటుగా ఉండేది లెండి. ఇప్పుడు పురుగులు కూడా చావటంలేదు) కొడుకు ఖాళీ సీసా చూపించి నటిస్తున్నాడనుకున్న తండి్ర, ముక్క బూతులు తిట్టటం  పా్రరంభించినా, మనిషి నీలంగా మారి నురగలు కక్కుతున్నప్పుడు మాత్రం ఆటోకోసం పరుగులు పెట్టారు. ఖర్మ కాకపోతే మరేంటండీ. ఒక్క ఆటోకూడా దొరకలేదు. ఆస్పత్రికి అరగంట ఆలస్యంగా తెచ్చారన్నారు డాక్టరు్ల. మనిషి దక్కలేదని వేరే చెప్పాలా.

ఇంకా చాలామందున్నారికపోతే నేను వీళ్ళందరిలోనూ కామన్ గా గమనించిన లక్షణాలు ఏంటయ్యా అంటే…  జీవితం మీద అవగాహన లేకపోవడం, బ్రతుకుతో సరైన గుణింతం చెయ్యకపోవటం, అన్నింటికన్నా ముఖ్యమైనది…  పా్రణం విలువ తెలియకపోవడం… పకో్కడి పా్రణం గురించి మనకి ఎలాగూ లెఖ్ఖ లేదు, కాని సొంత పా్రణం కూడా చిల్లి గవ్వతో సమానమంటే ఎట్టా సామీ.  అదేంటి? అలవోకగా పా్రణాలరి్పంచేస్తున్న వీరులగురించి అలా మాట్లాడుతున్నాడేంటని అనుకోకండి. వీరులా?  వీపీలా? నా బొందా!!..  అదేదో దేశంకోసం ప్రాణాలిచే్చసే్త నెత్తిన పెట్టుకోమటండీ. వాడి శవాన్ని భుజంమీద మోసినా జన్మ ధన్యమైనటే్ట కదా.. వీళ్ళు తమ శకి్తని, యుక్తిని, పా్రణాల్ని ఊరకనే కాలువలో్ల పారబోసారు. పోస్తున్నారు.

అలాంటివారందరికీ అనంకితం చేసు్తన్నా ఈ టపాని. మీకు మీరు ఎలాగూ పనికిరారు. కనీసం మీ కుటుంబాలగురించి ఆలోచించండి. ఒకవేళ నీకెవ్వరూ లేకపోతే, ఆ సందు చివర అనాధాశ్రమంలో జీతం తీసో్కని నౌఖరుగా జాయిన్ అయిపో.  చచ్చేవరకూ చాకిరీ చెయ్.  కనీసం మందికైనా పనికొసా్తవు. అంతేగాని దేముడిచ్చిన పా్రణాన్ని అంత చౌకగా ఖరు్చపెటే్టస్తానంటే మాత్రం నాకస్సలు నచ్చదు.  ఏమనుకోకండి.

Categories: తెలుగు, emotions, mind, psychology, world | 3 Comments

Post navigation

3 thoughts on “ప్రాణం విలువ

 1. chandu

  జనాల గురుంచి ఏం చెప్తవన్న…పిచ్చి ప్రజానీకం..
  అద్బుతమైన concept అంటారు.ఒక్కరు ఆచరించరు..లంచగొండితనం/రాజకీయాలు/మానవ సంబంధాలు/ఆరోగ్య సూత్రాలు/….. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నింటి మీద సినిమాలు వచ్చాయి.

  సినిమా అంటే అదొక మనోరంజకం..చదువుకున్న వెడవలకే సంస్కారం శూన్యంగా ఉన్న ఈ రోజుల్లో, ఇంక mass జనాలకి ఎక్కడ్నుంచి/ఎందుగురుంచి/ఎవరిగురుంచి మారాలి

 2. devi

  బాలూ…
  చాలా బాగా రాశావు. అసలు జంతువులు, క్రిమికీటకాల వంటి జన్మ కన్నా, ఎంతో ఉత్కృష్టమైన మానవ జన్మ లభించిందంటేనే మనం దాన్ని ఎంత విలువైనది గా చూసుకోవాలో అర్ధం కావడం లేదూ !!!
  కానీ ఎప్పుడు తెలుస్తుందటావ్ ???
  ఓ మహాకవి ఎంతో simple గా చెప్పినట్లు ” దేహమేరా దేవాలయం …జీవుడే సనాతన దైవం ” …ఇది అర్ధం అయితే ఇన్ని విషయాలు ఉంటాయా చెప్పు.

  దేన్నైనా అర్ధం చేసుకోవాలి అంటే దాని విలువ తెలుసుకోగలిగే విజ్ఞత ఉండాలి.

  నీ friend సూర్రాజు గురించి తీసుకుంటే అలాంటి వాళ్ళని మనం ఏం చెయ్యగలం చెప్పు. ఎవడి వల్లో చెడు అలవాట్లు అవుతాయి అంటే నేను వొప్పుకొను. మన బుధ్ధి మంచిదయితే ఎవరేం చెయ్యగలరు చెప్పు.

  అలాగే mr. rambabu సంగతి. తల్లి కష్టాన్ని అర్ధం చేసుకొని వాడు ఇక ఎవరి గురంచి ఆలోచిస్తాడు ??? ఒక్క మంచి పని ఏం చేసాడు అంటే పెళ్ళి చేస్కోలేదు. అదొక్కటే సంతోషించాల్సిన విషయం.

  and Mr. Mohan, ఈయనికి ఏం సమస్యా లేకపోవడం అనేది పెద్ద సమస్య . అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఉంది. అంటే తన జీవితం వడ్డించిన విస్తరి గా ఉంది కదా!!! అన్నీ ఇచ్చి వంట చెనుకోమనుంటే కష్టం ఎంతో తెలిసి వొచ్చి ఉండేది.

  ఇలా చెప్పడం లో మీ friends ని ఎగతాళి చెయ్యాలి అన్న ఉద్దేశ్యం ఏ మాత్రం లేదు. కానీ ఎందుకో వాళ్ళు చేతులారా జీవితాల్ని నాశనం చేసుకున్నారు అనిపించింది.
  చాలా మంది ఉన్నారు సర్, office party lo drinking is culture అంటారు. విషం తీసుకున్నారా లేదా అన్నది important. but not the quantity.
  some people say its a “medicated peg”. but i say , మన country atmospheric conditions కి ఇది వర్తించదు. ఏమంటారు???

  ఏం చెయ్యాలో తెలియనప్పుడో , ఏం తోచనప్పుడో i smoke thats all, but its not a habit అంటారు. ఏదన్నా కొంచెంతోనే మొదలవుతుంది. పూర్తిగా మునిగే వరకు గానీ తెలీదు.
  ఇవన్నీ నా feelings మాత్రమే.

  సరే. keep on writing. lets hope for the best.

 3. Sailaja

  Balu, Really impressed with your stories. Main thing I really liked the way you told the importance of life. I totally agree with you. Life has more meaning. No one should kill their life for stupid reasons. Problem can be big in the spur of moment but if one can manage that moment every problem will have solution. Suicide is not the solution for any problem.

  Keep up the good work with your writing. You inspire me.

  Great blog

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: