ప్రయాణం


sar-pass

అడుగెంత బరువెక్కగలదో? బ్రతుకెంత తీపెక్కగలదో?

“జీవితం ఓ ప్రయాణంట. నా బొంగేం కాదూ!” … మనసులో ఆర్ద్రత ఇంకిన మనిషికి ఒక మంచి మాట చెపే్త థక్కున వచ్చే సమాధానం ఇది.  ఇక్కడ ప్రయాణం అంటే ఏదో ఒక చోటినుంచి మరోచోటికి వెళ్ళటం కాదులెండి. కళ్ళతోచూసూ్త, కాళ్ళతో చేరువౌతూ, మనసుతో నేరు్చకుంటూ, మనిషిగా మారుతూ, సాటి మనిషికి సాయం చేసూ్త,  తప్పదన్నప్పుడు తడబడకుండా సహాయం అడుగుతూ, ఒకరితో ఒకరు కలిసి చేసే పయనం గురించి చెప్తున్నాను నేను. కానీ ఈమధ్య ఇలాంటి ప్రతిపదారా్ధలు ఎవరికీ సొక్కటంలేదన్నదే నా ఉకో్రషం.  రోజురోజుకీ జ్ఞానం ఎక్కువై, ధ్యానం కరువౌతున్న కాలం మరి.  చదివి తెలుసుకోవటం, చూసి నేరు్చకోవటమనే ప్రకి్రయల్ని పూరి్తగా మర్చిపోతున్నారు. సరె్లండి కానీ..

ఈ ప్రయాణమనేది కేవలం శరీరంతోనే కాదు కదండీ!! ఊహల్లో మనసుతో, నిద్రలో కలల్లో మెదడుతో చేసే ప్రయాణాలు ఇంకా రసవత్తరంగా ఉంటాయిగా.  హిమాలయాల కొసల్లోనే కాదు, సిటీ బస్సు చివరి సీటో్లంచి కూడా మనం ఎన్ని సితా్రలు సూళ్ళేదు?  ఎన్ని జరీ్నలు సెయ్యలేదు? ఒప్పుకుంటారా? మీరు గతంసారి చేసిన ప్రయాణం ఏదో గుర్తొచ్చిందా? ఇంతకీ నేను చెప్పాలనుకున్నది మనిషి చేసే ప్రయాణాలకి, అతని మనసులోని కాల్పనికతకి చాలా దగ్గర సంబంధం ఉందని.  ఆ రెండూ ఒకదాన్నొకటి తీవ్రంగా ప్రభావితం చేసా్తయి.   ఉదాహరణకి, మీ సొంతూర్లో నీకొక అమ్మాయంటే బాగా ఇష్టమనుకో.  అప్పుడు నువ్వు మనిషివి ముంబాయిలో ఉన్నా, మనసు మాత్రం ఖమ్మంలోనే ఎగురుతూ ఉంటుంది.  గంటకొకసారి ముంబాయి నుంచి ఖమ్మం ప్రయాణం..  క్షణంలో కళ్ళెదురుగా గమ్యం.. మరు క్షణం వెన్నెల.. వేసవిలో మబ్బులు.. వెంటనే వాన.. పూల దారులు.. పాల ధారలు.. అంతా నీ ఇష్టమే కదా..  ఏమాటకామాటే గానీ, ఎంత తియ్యగా ఉంటుందని అదంతా? 😉 ఊహల్లోని ప్రయాణాలివన్నీ ఒకవైపు. అదే విధంగా ఏ నయాగరా జలపాతాన్నో, హిమాలయా శిఖరాన్నో ఎదురుగా చూసిన “తరా్వత” మనసులో కలిగే అబ్బురం, ప్రకృతి కలిగించే పారవశ్యం, మరిన్ని ఊహలు ఉక్కిరిబిక్కిరి చెయ్యటం, ఇంకా ఇంకా చూడాలనిపించిటం, ఇంకొన్ని ప్రయాణాలు చెయ్యాలనిపించటం, ఇలా ప్రయాణం కలిగించే ఊహలు ఇవన్నీ రెండోవైపు.

ఇక, మధ్యలో మజిలీల గురించి  వేరే చెప్పాలా? ఒక్కొక్క మజిలీ ఒకొ్కక్క జ్ఞాపకం. మరి మనిషంటేనే ఒక జ్ఞాపకాల పుట్ట కదా. సో ఇలా ప్రతి రోజూ, ప్రతి క్షణం మనం ఏదోక ప్రయాణంలోనే ఉన్నప్పుడు, జీవితం ఒక ప్రయాణం కాకపోతే మరేంటి?  సరే అయితే, ఏ ప్రయాణం అయినా నిజంగా చేసారా లేక చిలిపి ఊహేనా అన్న సంగతి పక్కన పెడితే, ఇంకొక్క విషయం కూడా చెప్పుకోవాలండీ.  కాల్పనిక ప్రపంచం బాగుంటుంది, హాయిగా ఉంటుంది., కానీ నిజం ఇంకా బాగుంటుంది (చేరటం ఎంత కష్టమైనా సరే).  తియ్యటి ఊహని నిజం చేసుకోటానికి చేసే ప్రయత్నంలో ఇంకా మజా ఉంటుంది..అది ఏదైనా సరే. మరి అందిన తరా్వత పొందే ఆనందమో? దీని గురించి మరో టపాలో చెప్పుకుందాం గాని.. కట్ చేసే్త….

ప్రయాణాలంటే నాకు చాలా ఇష్టం. నేలమీంచి నీటిలోకి, అడవిలోంచి ఎడారిలోకి, మంచులోంచి వరదలోకి.. అసలు ఎక్కణ్ణుంచి ఎక్కడికైనా, ఉన్న ప్రపంచంలోంచి పూర్తిగా భిన్నమైన మరో ప్రపంచంలోకి..

“తనువు, మనసు రెండూ విశా్రంతి పొందాలంటే ఓ చక్కటి ప్రయాణం చేసి చూడు” అన్నది అక్షర సత్యం. అంటే ఘనత వహించిన మన ఐటి ఇంజినీరు్ల ప్రతి వారాంతంలో కారు డిక్కీలో బీరు సీసాలు నింపుకుని, పూటుగా తాగి తిరిగొచ్చి ఫేసుబుక్కులో ఫోటోలు పెట్టుకునే ఎంజాయ్మెంట్లు కూడా చాలా రిలాక్సింగా ఉంటాయనుకోండి (హాంగోవర్ సంగతి పక్కన పెడితే 😉 ) దానిగురించి వేరేగా మాటా్లడుకుందాం గాని, ఇప్పుడు నేను చెప్పేది ఏందయ్యా అంటే ఒక్క ముక్కలో.. “చక్కటి ప్రయాణం ప్లాన్ చేస్కోండి…  హాప్పీగా రిలాక్స్ అయి రండి”  ఏదో మిమ్మలి్న కొద్దిగా తోసి, ఎటోఅటు పంపించాలనే నా ప్రయత్నం.. అలా ఒకే ప్రపంచంలో మురిగిపోకూడదన్నదే నా ఉద్దేశం..

పూర్తిగా కొత్త ప్రదేశానికి వెళ్ళండి. కొత్త ఆహారం.. కొత్త మనుషులు.. కొత్త అలవాట్లు.. కొత్త గాలి.. కొత్త ఉతా్సహం.. ఎక్కడికెళ్ళినా ఇడీ్లయే తినాలని ప్రయతి్నంచకండి.  ఏసీ గదుల్లోంచి టూరిషు్టలుగా మీరు చూసే కొండ శిఖరాలు, టె్రక్కింగ్ చేసే్త ఇంకా రంజుగా ఉంటాయి.  కారులో చులాగ్గా వెళ్ళే కొడైకెనాల్ కొండ, కాళ్ళతో ఎక్కుతుంటే కెవ్వుమని కేక పెట్టిస్తుంది.  సీ్టమరులోనో, సీ్పడుబోటులోనో నువ్వు దాటేసిన నదీ తీరం, కయాకింగ్ చేసే్త కసక్కులా ఉంటుంది.  రోజంతా నడిచి నడిచి చీకటి పడగానే పడుకుంటే, మామూలు టెంటులో కటిక నేలమీద సీ్లపింగ్ బ్యాగు కూడా హంసతూలికా తల్పంలా అనిపిస్తుంది.   అలసిసొలసి తిరిగొచి్చన తరా్వత, సాంబారన్నం కూడా ఆవురావురుమని తినాలనిపిస్తుంది. శరీరాన్ని సాగదీస్తుంటే మనసు పరిగెడుతుందని తెలుసుకోండి. ఇలా ఆలోచించటం, ఇలా చెయ్యటం, మీ పిల్లలకివన్నీ ముందునుంచీ నేరి్పంచండి..

అసలు ఓ మనిషి చచ్చేలోగా తను ఏమేం చెయ్యగలడో, ఎంతెంత చెయ్యగలడో తెలుసుకోకుండా చావటం చాలా హృదయవిదారకం కాదూ? (pl check my ‘showcase’ for the original quote by Socrates)

అందుకే పదండి మరి. వెయ్యండి తొలి అడుగు.. మొదలెట్టండి మరో ప్రయాణం…  (చివరగా మీ బా్లగులో రాయటం మరిచిపోకండేం!) 🙂

.

Categories: తెలుగు, mind, outdoors, travel, world | 6 Comments

Post navigation

6 thoughts on “ప్రయాణం

 1. devi

  balu,
  only u can write such articles which make people feel and think and at least try to do what u suggest in your articles. they enable everyone to introspect and feel as if u r writing about him / her. nice art sir jee….
  keep writing. not to exaggerate, but i regularly check ur status message for a new article and if i donn find a new one, will be a bit disappointed, but will once again go through the old ones and try to understand them even better.

  thanks for making me try to know myself. 🙂

  • balu

   I am honored madam. Your complimenting words would really work wonders for my pen. Thank you so much for reading me 🙂 it makes me so happy too 🙂

 2. Sailaja

  Very nice Balu. I really went into “ooha lokam”. Keep it up. I don’t think any one can write like you

  • balu

   wow. I am delighted sailu but I am still a starter, struggling to frame my words, pick up right topics etc.. i am still not able to be neutral in expressing something, unable to write without attaching my own emotions.., but then, yes i am trying hard to excel at it.. chuddam em jarugutundo, kaani, your words delighted me and i will be writing more and try to give better content in an even better way 🙂

 3. I can’t read the language this post is written, but I can only guess that it’s about skiing! I just got back from a great ski trip. You can take a peek of that here:
  http://fisilis.wordpress.com/2011/02/28/utah-ski-trip-solitude/

  here:
  http://fisilis.wordpress.com/2011/03/01/utah-ski-trip-powder-mountain/

  and some travel food experiences here:
  http://fisilis.wordpress.com/2011/03/01/paying-a-visit-to-the-oldest-saloon-in-utah/

  xo
  Mindy

  • hi mindy,
   no this is not about skiing, but about inspiring people to take a vacation and travel to adventurous places. I read your posts and they are just awesome. I will try to make it to Utah and will surely contact you when i do it.

   thanks for taking a look at the post 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: