విసుర్లు


Rough transcript of the audio above:

[telugu-transcript] మన ఊర్లో మనలాంటి విద్యార్ధి ఒకడు వృధా చేసే రెండు దశాబ్దాల్లో, మనం చదువుకునే గాడికొట్టు చదువుల్లో, మనకి తెలిసిన మూస మనుషుల్లో, మనం చూసిన మామూలు జీవితాల్లో, ఎవ్వరికీ తెలియని ఎవ్వరూ నేర్పించని సూత్రం ఒకటి నిశ్శబ్ధంగా చెయ్యి జారిపోతోందండీ!

తినేయటం తప్పితే తిరిగి ఇవ్వటం మనం ఎలాగూ నేర్చుకోలేదు . దోచుకుని దాచేసుకోవటం తప్పితే దాతృత్వం మనకెవ్వరూ నేర్పించలేదు. సరే ఏదోకటి నీ కలుగులో నీకు కలిగినదాంతో నీవాళ్ళతో నిబ్బరంగా బతికేస్తున్నావనుకుంటున్నావేమో? అక్కడే ఉంది తిరకాసు. నీ చుట్టూ ఓ గిరిగీసుకుని నీ చిన్న ప్రపంచాన్ని నువ్వు నిర్వచించుకోవటంలో తప్పులేదు కానీ ఆ గీతకి అవతల ఉన్న విశాల విశ్వాన్ని విస్మరించటం చాలా పెద్ద తప్పు. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక శక్తి నిద్రాణంగా ఉంటుందీ అని నువ్వు నమ్మితే ఆ శక్తిని సరైన మార్గంలో పెట్టుకుని, నిన్ను సృష్టించిన ఈ ప్రపంచానికి నువ్వు ఏదో ఒకటి చెయ్యాల్సిన బాధ్యత కూడా నీదే! ఈ విషయంలో నిన్న మనం చెప్పుకున్న ‘ఇద్దరు స్నేహితులూ’ నీకు కాస్త సాయం చేస్తారేమో కాని నిజంగా మార్పు రావలసింది మాత్రం నీలోనే! అందుకే నువ్వు ఎలాంటి మనుషులతో మసలుతున్నావు, ఎలా ఆలోచిస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు అన్నవి చాలా ముఖ్యం.

ఎదవలు, ఏ గమ్యం లేనివాళ్ళు, ఎవడెలా సస్తే నాకెందుకులే అనుకునేవాళ్లు, ఏదో పది మంది మాత్రమే నా ప్రపంచం అని బతికేవాళ్ళు, ఏరు దాటాక తెప్ప తగలేసేవాళ్ళు, ఎంత వేగంగా వెళ్తే అంత గొప్ప అనుకునేవాళ్లు, ప్రపంచంలో దేన్నైనా సరే అందంతోనే కొలిచే వాళ్ళు …. కేవలం ఇలాంటివాళ్ళతోనే నీ ప్రపంచం నిండిపోయి ఉంటే, నువ్వేం కోల్పోతున్నావో నీకర్ధమయ్యేసరికి నిజంగానే చాలా సమయం పడుతుంది. మార్చెయ్ అందరినీ మార్చెయ్ .. తప్పదంటే దూరంగా పారిపో. ఇది నీ చుట్టూ ఉన్న మనుషులగురించి.

ఇక నీ ఆలోచనా విధానం .. ఏం ఆలోచించాలో ఎలా ఆలోచించాలో అన్నది నీ ఆధీనంలోనే ఉంటుందని నీకు తెలుసా? నీ ఆలోచనలని నువ్వు శాసించగలవని నువ్వెప్పుడైనా గమనించావా? ఒకసారి ప్రయత్నించి చూడు. ఇది కరెక్ట్ కాదు అనుకుంటే వెంటనే ఆ ఆలోచనని తుడిచెయ్. చెరిగిపోతుంది..

ఇక నువ్వు మాట్లాడే మాటలు.. రోజుకి ఎన్ని పనికిరాని మాటలు మాట్లాడుతున్నావో ఓసారి లెక్కపెట్టుకుని చూడు . పొల్లు మాట్లాడ్డం తగ్గించు. తప్పు మాట్లాడిన వాణ్ని వెంటనే సరిచెయ్. దేనికీ భయపడకు. ఎందుకురా ఈ పనికిరాని చర్చలు. ఎవడికి కూడు పెడతాయి? ఏ శరీరాన్ని అలంకరించేద్దామని అంత ఆతృత పడిపోతున్నావు ప్రతి మాటలోనూ? ఇవ్వాళ నీ ఎదురుగా ఉన్న గోడ మీద రాసుకో:

ఏం చేసినా అనారోగ్యం, ఎన్నిపూసినా వృద్ధాప్యం, ఎంత దాచినా పాపం, ఎక్కడ దాగినా ఉసురు … సద్దుగా ఉండవు గాక ఉండవురా!

మరెందుకీ తాపత్రయం? మంచి మాత్రమే మాట్లాడు, మంచిని మాత్రమే ఆలొచించు. ఆ ఎదవ గురించి ఎవరైనా అడిగినా నీకు తెలియదని చెప్పేయ్.

ఎవడి ఖర్మకి వాడు పోయే పురాణకాలం కాదురా ఇది. ఎవడి ఆలోచనలకి వాడే బలైపోయే ఆధునిక యుగం ఇది. తెలుసుకో .. మెసులుకో .. గెలుచుకో.

Advertisements
Categories: తెలుగు, friends, life, my, philosophy, psychology, suggestions | Tags: , | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Blog at WordPress.com.

%d bloggers like this: