Book of Balu


11.5.2017

ఒరే బుజ్జిగా! బుర్ర ఉన్నోడితో తిరిగితే బుద్ధి పెరుగుద్ది … బుర్రలో బురద ఉన్నోడితో తిరిగితే బురదే పెరుగుద్ది … ఆ తాన నీ ఇష్ఠమ్ మరి …

.

14.4.2017
ఎవడి సూర్యోదయం వాడికవ్వాలి బాబూ!
మనం చెపితే బాగుపడిపోరు ఎందుకంటే వినరు కాబట్టి.
మనని చూసి నేఁర్చీసుకోరు ఎందుకంటే చూడరు కాబట్టి ..
— బా.బా. (మానసిక ప్రశాంతతకి మొదటి సూత్రం)

.

15.12.2016
Think and act like you are very important, but live like you are not.

.

10.12.2016
Do you know how lucky it is to be able to experience boredom? Not having 10 things to do next, not having 100 pending tasks, not perceiving anything interesting.. Nothing to read, nothing to play, nowhere to go and no one to talk to.. Nothing but just blankness in the mind? Wow, that all sounds like a transcendental yogic state to me .. You must be lucky to be a ‘Rishi’ in civilian life.. Wow.. wow. So Boredom and Meditation are two faces of the same coin. Now go and celebrate yourself.

.

24.04.2016

నాదన్నది ఏదీ లేదనుకుని నాన్నయ్యాను నేనుఅడిగినదేదీ లేదనకూడదని అమ్మయ్యింది తను .. ఇంక పిల్లలే మా లోకం .. మరి మీరు?

.

01.02.2016

బండలాంటి నాకు బంగారాన్ని ‘కన్యాదానం’ చేసి నా జీవితాన్నే తీర్చిదిద్దిన మహానీయుడిక లేడు! పిల్లనిచ్చిన మామ పిత్రుసమానుడని ఎందుకంటారో కొద్దికొద్దిగా అర్దమౌతోందిప్పుడిప్పుడే!! నిన్ను కన్నది నీ తండ్రి అయితే నిన్ను తండ్రిని చేసినది నీ మామ దానం కదా! … …. …. “కొడుకుల జగన్నాధం” గారికి అశ్రునయనాలతో వీడ్కోలు!!

.

27.10.2015
The earlier you realize how small you are, the better.
.
16.10.2015
Be small when you talk. Because a surprise is better than a disappointment.
.
12.09.2015

How to determine something is good or bad? Its bad if you lose yourself in it. Its good if you find yourself in it. As simple as that.

.

30.08.2015

నీడ పొడుగు చూసి మిడిసిపడకు
నీ డబ్బుదస్కమొట్టి చిల్లు పడవ…
వాపుబలుపుల తారతమ్యమెరుగర కొడక
దానమే మిగులు నీ కడకు, భడవ!

.

23.08.2015

ఆకలికి ఆలోచన తోడైతే పుట్టింది శాఖాహారం, లేకపోతే మనిషి ఇప్పటికీ మాంసం తింటూనే బతికేవాడు.
ఆకలికి అసహనం జోడైతే పుట్టింది మాంసాహారం, అలా వదిలేస్తే ఏదోక రోజు మనిషి మనిషినే పీక్కు తింటాడు.

.

07.07.2015

మంచి ఎండలొ రెండు గంటలు కొత్త కారుని కడిగి తుడిచి,
మజ్జిగ కలిపిన రాగిజావను ఆవురావని కుడిచి కుడిచి
మత్తుగా అపరాహ్ణ వేళకు పంచభక్షములారగించి
కునుకుదీయగ కార్తికేయుడు గడచిపొయ్యెను ఆదివారము 🙂

04.01.2015

రోగాలన్నింటిలోనూ అతి హేయమైనది భయంకరమైనది ‘ద్వేషం’. మనిషి తనకు తానే నయం చేసుకోగలిగే రోగం కూడా ఇదోక్కటే.. ఎంత విడ్డూరమైనది కదా మనిషి జీవితం…  ‘Hatred’ is the most dreadful of all diseases. And it is the only disease that a man can cure himself on his own. What a marvel of contradictions is human life. Oh!

09.11.2014

ఏం చేసినా అనారోగ్యం, ఎన్నిపూసినా వృద్ధాప్యం, ఎంత దాచినా పాపం, ఎక్కడ దాగినా ఉసురు … సద్దుగా ఉండవు గాక ఉండవురా!

23.08.2014

ఎదవలు, ఏ గమ్యం లేనివాళ్ళు, ఎవడెలా సస్తే నాకెందుకులే అనుకునేవాళ్లు, ఏదో పది మంది మాత్రమే నా ప్రపంచం అని బతికేవాళ్ళు, ఏరు దాటాక తెప్ప తగలేసేవాళ్ళు, ఎంత వేగంగా వెళ్తే అంత గొప్ప అనుకునేవాళ్లు, ప్రపంచంలో ఏదైనా సరే అందంగా ఉంటే ఎక్కువ గొప్ప అని అనుకునేవాళ్లు …. కేవలం ఇలాంటివాళ్ళతోనే నీ ప్రపంచం నిండిపోయి ఉంటే, నువ్వేం కోల్పోతున్నావో నీకర్ధమయ్యేసరికి నిజంగానే చాలా సమయం పడుతుంది.

.

13.05.2014

Success is the energy fountain that spurts out from within your own heart.. It never depends on the support you get from an external source.. Otherwise, with the support Sonia mom is giving, RG would have been a great success.. right? ;):P #its #a #simple #life
.

09.05.2014
బంగారు కడ్డీలు దాచేసుకుంటున్నావా బుజ్జీ? చివరాఖరికి నీక్కావలసింది కర్రలు నాన్నా, కడ్డీలు కాదు.
.

20.02.2014
Sky is the limit, but the floor is where you fight it out…. Stand your ground, close your eyes go beyond your wildest dreams and stop not until you reach there.

.

03.11.2013

Equality‘ is something like a Science subject in the school.. Only people who study it would understand it..  Those who watch it would think of it.. And only those who miss it would try to invent it..:) And for everyone else, its just a crappy subject where they know they don’t score well.
Everyone is equal in this world my friend.. Treat em the same way. 🙂

.

19.06.2013

World only has so much God created and as much Man made possible. What else are you showing off?

.

03.02.2013

Individualists are a real problem if they are frank. You can’t hold on to your crap when they are around. Its quite possible you can co-exist with them if you get rid of a few of your stupidities.. of course if only you choose to… and you better do it.. why? why should you care? Why the f can you not ignore them and move on?… Because there are very few people who actually talk to you straight and frank..They surely are helping YOU… if you get that point.

.

02.02.2013

OK… so here’s the Murphy Jr’s Law:  “Any toy that can be broken, will be broken”

.

07.01.2012

ఒకటే ఒక్కటి కదరా ఎపుడూ తొలి అడుగన్నది ఒంటరిదీ
ఒంటరిదైనా ఒళ్లెరగదురోయ్ తొలి ముద్దెపుడూ తీయనిది..
తేనెలూరు తన తలపుల గారెలు తినీ తినీ దరి ఒరిగిన మనసుకు
ఒంటరితనమే కమ్మనిదీ మరి ఒంటరి నడకేగద హాయీ..ఒంటరిబతుకొక పూదోయి.

.

20.12.2012

silence!!! …sign of a revolution?
symptom of a pain?
signal of a change?
saber of a soldier?
souvenir of a relation?
sac of a dream?
start of a cyclone?
story of a mind?
silence…silence…oh! my silence..

.

16.11.2012

తమ్ముడూ!  తగలాల్సిన చోట తగిలితేనే తత్త్వం తలకెక్కుతుంది..  నీ అనుభవం, మేధస్సు, చదివిన పుస్తకాలు, తెలిసిన మనుషులు, బుర్రలో ఆలోచనలు, ఫోన్లో నంబర్లు ఇవేవీ పనికిరాకుండా పోయిన సందర్భాలు ఎదురౌతున్నకొద్దీ నీ ధృక్పధం మారుతూ వస్తుంది.. కోట్లు కుమ్మరించినా  కూసింత ప్రేమ, ఆనందం ‘కొన’లేవని తెలిసినప్పుడు ఎక్కడో ఓ కొత్త ఆలోచన మొదలౌతుంది..ఆస్తులు రాసిచ్చినా అయినవాళ్ళని అరనిమిషం ఎక్కువ బతికించలేవని తెలిసిన రోజు ఆ ఆలోచనకొక రూపం వస్తుంది..  నీకున్న వాటికన్నా, నాకు లేనివి విలువైనవని నెమ్మదిగా తెలుస్తూ వస్తుంది.. పంచుకోవటంలో ఉన్న హాయితో ప్రాణం లేచొస్తుంది.. ఇచ్చిపుచ్చుకోవటం ఇష్టంగా అనిపిస్తుంది..ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ నువ్వు కళ్ళు మూసుకుని చూడకుండా వదిలేసినవన్నీ ఒక్కొక్కటే కనిపించటం ప్రారంభిస్తాయి.. కలల్లో కూడా వెంటాడి నిద్రపట్టకుండా చేస్తాయి.. గుర్తుంచుకో! అప్పుడే నువ్వు కొత్తగా ఆరంభిస్తావు నీ అసలైన జీవితాన్ని..

.

8.10.2012

వద్దు వద్దోయమ్మ నీకు దండాలు.. వద్దు అస్సలు వద్దు ప్రేమ తంటాలు.
వల్లకాదిక నాకు వలపు గిరికీలింక  వంగలేనొద్దులే  గులపు గుంజీలు.
వానచినుకొక్కోటి వెల్లువైయుప్పెనై  వరద గోదారల్లె మీదపడి ముంచినటు
మోహమో తాపమో ఏదొ తెలియదుగాని మగువ మందారమ్ముముద్దులతొ ముంచెనను .

.

7.10.2012

దోర చూపులు దొలిచె.. దొండ పెదవులు పిలిచె.. జలతారు అందాల జలజారి జాణ నీ
హోయలు జలపాతమై హోరెత్తి చంపెనే, దొడ్డ మనసుతొ నన్ను కాచి కరుణించు
సరిగంచు సీరలో సిరులొలుకు సొగసుతో సీరికయ్యాలకై కాలు దువ్వకె చెలీ
విడను నీ చేయి ఆ విరహాల వుప్పెనలో క్షణమైన యుగములే లావణ్య వీణ!

.

21.9.2012

ఒరే బుజ్జిగా! పుట్టటం, సావటం.. మజ్జిలో దొరికిన్దంతా నొల్లీసుకుని మడుసులకి దూరంగా బతకటం.. ఇయన్నీ నాబోటి సెద పురుగుల లచ్చనం రా! పుట్టినప్పుడు ఎందుకు పుట్టావో తెలీకపోయినా సచ్చినప్పుడు మాత్రం ఎందుకు సస్తన్నావోన్ సరిగ్గా తెలియాల్రా! సరిత్ర రాసేటోళ్ళు నీ గురించి నాలుగు ముక్కలు రాయాలంటే సానా నొప్పెట్టే పనొకటి సెయ్యాల! సేత్తావా? సెయ్యగలవా?
“ఏంది తాతా! అది?”
అందర్నీ పేమించాల.. మందితో మంచిగ బతకాల.. అడిగినోడికల్లా సేవున్నంత సాయం సెయ్యాల…
“అదంతా కస్టమా తాతా?”
అవున్రా.. సాటి మనిషిని పేమించటం, గోరవించటం అందులోనూ సాయం సెయ్యటం సానా కష్టం ఈ పెపంచకంలో..

.

9.9.2012

‘అందం’ రెండు రకాలు: మత్తెక్కించి నిద్ర పుచ్చేది, పిచ్చెక్కించి నిద్ర లేకుండా చేసేది..
అమ్మాయిలు కూడా రెండే రకాలు: తన అందం తనకు తెలిసినవారు.. తెలియనివారు..
హయ్యో ఇక అబ్బాయిలు కూడా రెండే రకాలు బాబూ!
నిజమైన అందానికి నిర్వచనం తెలిసినవారు.. అబద్ధపు ఆకర్షణలో అల్లకల్లోలమయ్యేవారు..

.

6.9.2012

బుజ్జిగాడితో రెండే సమస్యలు.. 😦
1. ఆడు తాగితే మనిషి కాదు;
2. ఆడు తాగకపోయినా మనిషి కాదు;

.

26.08.2012

మన చుట్టూ ఎంతోమంది మంచోళ్ళున్నారు కాని వాళ్ళలో చాలామందికి నిజంగా చాలా విషయాలు తెలీదు.. ఆ తెలీనితనాన్ని మనం చెడ్డతనంగా పరిగణించకూడదు.  స్నేహం, జీవితం, పని, పరిహాసం, దర్పం, దగా, తోడూ, త్రోవాలాంటి ప్రతి ముఖ్య  విషయానికీ వాళ్ళ సొంత నిర్వచనాలు వాళ్లకుంటాయి.   డబ్బు పొరల అడుగున భూస్థాపితమైపోయున్నారు కొందరు…. అపారదర్శక తెరల మాటున అదే జీవితమనుకుంటున్నారు మరికొందరు….  గాజు లోగిళ్ళలో మోజు మొహాలతో రోజూ తాము చూసే అద్దమే నిజంగా నిజమనుకుంటున్నారు ఇంకొందరు.. ‘నేను’ మాత్రమే నిజమని, నమ్మకమే జీవితమని, తాను నమ్మిందే వేదమని, నన్ను కాదన్నవాడు ఎదవని, నన్ను పొగిడినవాడు హితుడని,  నన్ను తెగిడినవాడు తగడని…. ఇలా ఎన్నని చెప్పను? ఒక మనిషి విజ్ఞానం, మేధ, తపస్సు, మంచితనం వృధా కావటానికి కారణాలనేకం…. కాని ప్రతిరోజూ సూర్యోదయమైనట్టుగానే ప్రతి మనిషికీ జ్ఞానోదయం అవుతుంది.. తప్పకుండా.. అయితే నేడు, పోతే రేపు.. అందువల్ల అందరినీ మంచిగానే చూడండి.. అందరితో కలుపుకుపొండి.. ఎందుకీ గోల, గొడవలు?
.

25.08.2012

డబ్బు సంపాయించేస్తే సౌఖ్యం పెరుగుతుందేమో గాని నాణ్యత పెరగదు బాబూ! ఖరీదైన ఫోనున్నవాళ్ళందరూ తియ్యగా, తిన్నగా, చక్కగా మాట్లాడగలరా?
కాబట్టి, లేనప్పుడు ఎలా ఉంటుందో తెలిసినవాడు, గుర్తుంచుకున్నవాడు మాత్రమే…. ఉన్నప్పుడు నాణ్యత గురించి ఆలోచించగలడు అన్నది నా అభిప్రాయం.

.

25.07.2012

ఒక మనిషి ఒక పదిరూపాయల నోటు చింపేస్తే…
పదిమంది పది పదిరూపాయల నోట్లు చింపేస్తే…
పదివేల మంది తలా ఒక పదిరూపాయల నోటూ చింపేస్తే..
పది లక్షల మంది పిచ్చెక్కి పోయి, బుర్రకొక పదిరూపాయల నోటు చింపేస్తే..
హయ్యో! ‘ఇలియానా’ కి ఒక సినిమా అవుతుంది.. ‘ఐమాక్స్’ వాడికి ఒక షో అవుతుంది.. ‘పాప్ కార్న్’ వాడికి పూట భోజనం అవుతుంది.. ‘పెప్సి’ వాడికి పూర్తి పండగ అవుతుంది..
బాబులారా! ‘అర్ధ శాస్త్ర జీవిత చక్రాలు’ అలా ఉంచి, మన కష్టార్జితంతో మరొకడు బతికితే తప్పు లేదు కాని.. మెదడు లేని ఎదవలు మెక్కి రాలిపోతేనే తప్పు.. ఆలోచించండి..
ఎదవ మనుషుల్ని, ఎదవ పనులని ప్రోత్సహించకండి.. నాల్గణాల వస్తువుని (పెప్సి గాని, సినిమా గాని) నోట్లు విసిరి కొనకండి..
#when #was #the #last #time #you #listened #to #me #:p

.

14.07.2012

ఓటమి ఓ లోయలాంటిది.. జస్ట్ కాలు జారితే చాలు.. కాని గెలుపో? గుడి మెట్లెక్కినట్టు ఒక్కో మెట్టూ ఎక్కాలి.. తీరా ఎక్కాక గుళ్ళో దేముడున్నాడా లేదా అన్నది వేరే సంగతి.. :p అలా అని జీవితమంతా గుళ్ళూ గోపురాల చుట్టూ తిరుగుతూ కూర్చుంటే కొండకీ లోయకీ తేడా ఉండదు.. :p అందుకే పెద్దలన్నారు.. గెలుపోటములు లేని జీవితమే జీవితం అని.. 🙂 ఫ్యూ!

.

1.07.2012

ఎదవలు బాబూ ఎదవలు ఎదవలు ఎక్కడ చూసిన ఉంటారు..
ఉన్నదందరూ ఎదవలు అయితే, దాన్నే ‘కాంగ్రీస్’ అంటారు..
ఎదవలకే ముదురెదవని ఎంచి ఇట్టే ముందుకు తెస్తారు..
ఆ ఎదవే మన ఆతీ గితీ ‘పతి’.. ఆళ్ళే చప్పట్లు కొడతారు. ఛీ! నా దేశం!

.

02.06.2012

Call it a commemorative poem on the 4th anniversary 😉

washed ashore on the purple sands,
walking up the hill with my open hands,
with only the guts and gulls in the air,
singing me the best of lullaby songs… 🙂
.

28.05.2012

గుహల మెసిలెడి మడిసి గద్దె మేడలు గట్టి జులపాల శిరుబెంచి జడలు మడిచి
చిక్కమొకటేయక్కయాలియన్నియుననుచు చివరివరకాశకోశములు గట్టి
మగువ, అత్తరు, మత్తు, మదపు వాకిళ్ళలో మెసిలి బతుకిదియెనని మురిసిబోయి
కాటి కంపదియెల్ల కాసు కంపని భ్రమసి కోరికల కెరటాల సేదుజేసిన నరుని
గుడిసేటి సౌఖ్యాలు గుద్దిపడవేయురో గుడి ఎంత పదిలమో! గుండెంత (గుండు ఎంత) సుఖమో!!
.

21.04.2012

నెత్తిమీద కాలుబెట్టి ఎక్కిపోతరు… మడిసిని నెట్టుకుంటు కూలదోసి తొక్కిపోతరు..

నిన్ను నన్ను చితక్కొట్టి దోచుకెళతరు… బొందికి చాలదంటు రాశులెన్నొ దాచిపెడతరు..

కూడబెట్టిన శొమ్ములన్ని కావడిగట్టి మరి తన తోడబటుకుబోవలంటు ఆశపడతరు..

సాటిమనిషి కష్ఠం కనిపించనోడికి, కణకణ కాలుతున్న కాష్ఠం వినిపించనోడికి

గుట్టలుగా మిగిలిన ఈ బొమికలన్నీ చెప్పే  సత్తెమొకటి నవ్వుతోంది కళ్ళముంగట

దాచినదంతా పంచెయ్ బ్రతికి ఉండగా.. పిడికెడు మట్టే మిగిలేది నువ్వు కుళ్ళుతుండగ.. కాణీ కాసు కూడ రాదుర నువు కాలుతుండగ..

.

20.04.2012

I don’t mind a failure, but I mind until I fail.. X-( 🙂

.

14.04.2012

పులిసిపోయినమ్మ పది కంచాల్లో వడ్డించుకుంటే, వాచిపోయినమ్మకి ఒక్క కంచానికి కూడా దిక్కు లేదు.. ఏంటో ఈ అసమానతలు!!!

.

09.04.2012

“Anything spherical is attractive”, is an inherent law of the Universe.. But loving half spheres is purely a human instinct 😉

.

08.04.2012

గెలిచేవరకూ ఓడిపోగలిగే సత్తా ఉన్నప్పుడు కోరుకున్నవాటికన్నా కోల్పోయినవే ఎక్కువుండటం పెద్ద సమస్యేంకాదు..

.

10.12.2011

When the suffering makes you deny the existence of God, the saviors let you believe in him.

20.10.2011

చిన్న చిన్న సమస్యలతో కుంగిపోయి బెంగెట్టుకున్న ఓ నేస్తం కోసం ఇది!!
 
బాధలు కావవి భగ్గున నిను మండించే ఇంఢనాలు .. కష్ఠాలు కావవి కవ్వించే అవకాశపు కరచాలనాలు. 
తప్పులు కావవి నీ తుప్పొదిలించే  తూరుపు తూణీరాలు. . . చెప్పులు కావవి నిను తట్టిలేపుతున్న చలువల చందనాలు
వంగిన కొద్దీ వంగోబెట్టే   దొంగ ప్రపంచపు దాష్ఠీకాన్ని, తుంగలొ తొక్కి ముందుకు అడుగెయ్ నీకే నీకే నీరాజనాలు.

.

27.03.2012

What? I can’t have only friends, unless all my friends have only friends but no enemies? bad bad!! #grow #up #world

.

19.10.2011

beauty is joy forever.. it won’t change with the wrinkles because my eyes can’t see them… it won’t change with the color, because my eyes won’t care..

.

19.09.2011

if you find someone behaving like some animal or insect, may be its your fault to be too human 😐 huh, the world!

.

23.08.2011

తన వంతొచ్చినప్పుడు  తలుపు కూడా తియ్యని చక్కనమ్మ, తీరా వాన వెలిశాక  తియ్యటి కబుర్లు చెప్పిందంట.. ఏంటో ఈ మనుషులు?

.

13.08.2011

Love is something that comes with no conditions, not pleading for respect or anything else in return, and so when the hatchlings leave the nest, we say them a silent good-bye but never take it as something disrespectful

.

11.08.2011

Its not talent that is scarce in this world, but only who can recognize it 😦

.

10.08.2011

If the life is not colourful, then let your thoughts be.. and let your hopes be 🙂

.

09.07.2011

Its not the cost of your clothes, size of your car or the social status that defines you.  It is how much you are willing to help a falling guy, that shows your true worth.  Whether its a physical fall, or mental or career. http://wp.me/ptWjb-cw

.

03.07.2011

The problem with human life is that you get so satisfied with stupid, silly things before you go to bed and wake up next morning hungry & dissatisfied 🙂

.

12.06.2011

Recently, quite a few friends and family, became victims of bad politics at work place and here is a bullet shot to encourage them:

ఏదైనా ఒకటేరా ఏరాయైతేనేమిలే? ఎవరైనా ఒకటేరా ఏనోరైతేనేమిలే?
ఎటువైపైనా ఒకటేరా ఏదారైతేనేమిలే? చీకటి వెలుగులు ఒకటేరా మరి ఏ రోజైతేనేమిలే?
మంచిని పంచుతు, నిజాలు పలుకుతు దూసుకుపోయే దివ్వెల దారికి,
ముక్కుతు, మూల్గుతు, వెనుకకు నెట్టుతు ఎవడడ్డొస్తేనేమిలే?

howzat? 🙂

.

21.05.2011

To all my young/old friends alike, who share their happiness with me when they fall in love (rather multiple times nowadays 😉 ):

——-

you are my love and you are my lust;

anything for ya i can bite even the dust;

whatever they call me bloody last or first;

your thought is the only thing that gives me thrust;

.

think of it, you don’t get sleep..

think of it, you forget to eat..

think of it,  ya dreamy treat..

think of it n its all  retreat..

then my boy! you are in love

with the only girl, who is ever so sweet

——

how do you like it? 😀

.

16.05.2011

Life is a very different realm than what you think it to be while you r in a bar, or with your girl friend or talking to your manager 😉

.

31.03.2011

If the world is only teaching you how to snatch it away from others, its better you learn it yourself about how to give it back ;;)

.

10.03.2011

If you are leaking minutes out of your time, then you are essentially leaking life out of your hands.

.

13.02.2011

ఆడాళ్ళే లేకపోతే ప్రపంచంలో వంద సునామీలొచ్చి మగ సోంబేరులందరూ మునిగి కొట్టుకుపోరూ?

.

18.09.2011:      happiness

happiness can be retrospectively defined as making someone else happy.

.

14.09.2011:

Neither is it a ship, nor you a true sailor if the captain is disobeyed.

.

09.01.2011:    Another poem – ‘ponee.. ponee..’

పోనీ పోనీ ఏదైనా .. పోపోతే గానీ రాదన్నా.. పోయినచోటే దొరికేదైతే పోగొట్టడమిక లైటన్నా..
పోతే పోనీ ఏదైనా .. పోయినదంతా రాదన్నా..  పోయి మరీ తిరిగొచ్చినదైతే ఇంకెప్పటికీ పోదన్నా..
పోతూ పోతూ ఉందన్నా..  చల్ పోగాలంలో ఉందన్నా.. పోతానని పడిచస్తూ ఉంటే పోయి రమ్మనే చెప్పన్నా..
పోగా పోగా బతుకన్నా.. మరి పోయి వచ్చినది బతుకన్నా.. నీదేదిపోయినా ఎంతపోయినా ఎవడికి ఏం దొబ్బిన్దన్నా .. ఇంకెవడిది ఏం పోయిందన్నా…

(to be refined and contd.. keep watching) 😀

howzat?

.

3.12.2010:        Another poem – ‘I am’

I am not happy. I am not sad.
Things are always not that bad.
Whatever they call it shit or fad,
I keep dashing off my mind lil’ tad.

I am just a coil in the wrap of a motion.
I am just a tide on the edge of an ocean.
I am just a tiny bottle of love potion.
I am just a better in every relation.

Neither a happiness, nor any pain,
Kick me or dump me, never would i min’
How can I not write about that rain,
Inking a life would be never in vain.

Howzat?  😀 😀 😀

(to be continued)

.

23.11.2010:

True friends at times will have intense hatred of each other to actually qualify that trueness 🙂

.

24.10.2010:

There is nothing called Bad but which is just a lesser Good.

.

22.08.2010:

Your image of your own, changes as dynamically as with your image of others, my friend!  And these two changes are often destructively opposite in direction. Like if you think everyone around you are fools, then it may give you a false notion of your own superiority.  You push something away for an egoistic reason, and that pulls you into a new, different realm of psychological awareness. So, I think, Life is about keeping this push-pull in a constructive equilibrium, like whatever comes your way (+/-), it should be countered with a positive gesture to keep the overall balance out of all negative spirals…and that is a choice… and that choice is yours… and a very few choose wisely :p

.

12.08.2010: A small poem I wrote for a depressed friend and felt like sharing with you all 🙂

hate me strong and hate me tight,
only my friends can hate me right?
i know (s)he wants me to work on a trait
n that’s why they do so hate me straight.

.

10.08.2010:

Proclivity for hard-work can succeed only with a positive inclination to team-work.

.

09.08.2010:

If you think information, power or position can make you superior, then you are utterly wrong 😉  And if you think someone is superior in that way, then you are utterly foolish :p

.

03.08.2010:

Both sound and silence can be inappropriate in the absence of proper timing.

Always Remember!  Information is only a Resource, but not a Capability.


10.07.2010:

One of the things that you can’t explain in words, is what you feel when someone gently kicks your palm from inside a mother’s womb 😀

17.01.2010:

What had history destroyed, will be relived in future for sure – don’t worry – had you missed to learn from it 🙂

26.11.2009:

Have an ego for yourself… looks like it’s honored everywhere.. heck 😦

24.10.2009:

మట్టితో చిన్న పిడత చేసి చూడు మిత్రమా.. జీవితాన్ని మలుచుకోవటం ఎంత కష్టమో  అర్ధమౌతుంది…

మనసుతో చిన్న మంచి చేసి చూడ నేస్తమా.. ప్రపంచాన్ని మార్చటం ఎంత సులభమో తెలిసిపోతుంది….

26.8.2009:
Tell the world who you are, else the world will tell you.

25.8.2009:
The problem with commitments is that life suddenly becomes real, once you are committed. Be prepared and happy face it 🙂

1.8.2009:
one of my juniors asked me whether a govt job is good or a private one. i said:
attitude – opportunity – jobSecurity.. if you have the first two.. you really don’t need the third… but since the 2nd is highly unpredictable, you better go for the 3rd, if you don’t already have the first..

3.5.2009:

ఏం బతకాలో తెలియని వాడికి ఎలా బతకాలో ఏం తెలుస్తుంది? తన కళ్ళు తిరిగినా నీకానందం అందించే రంగులరాట్నం జీవితమైతే, మరొకరి చీకటి నలుపుని తన రంగులతో నింపటం బ్రతకటం..ప్రయత్నించి చూడు.

3.7.2007:

ఎన్ని కొమ్మలు నరికినా ఎదిగే చెట్టు నా ఆదర్శం. ఎన్నిసార్లు క్రిందపడినా ఎగిరే కెరటం నా దైవం. ఎదురీత నా మతం. ఎదురెళ్ళటం నా నైజం. మిన్ను విరిగి మీద పడినా, ప్రపంచమంతా ఎదురు నిలిచినా, పీక తెగి క్రింద పడినా.. నమ్మిన దానికోసం నిలుచునే ఉంటాన్నేను. మనో దౌర్బల్యం అస్సలు నచ్చదు నాకు..

23.10.2008:

పుట్టినచోటే ఆగదు చినుకు … అడుగెట్టిన చోటే ఆగదు బ్రతుకు …. ఎందుకు పుటకో .. ఎందుకు చావో … చచ్చేలోగా గమ్యం వెతుకు … అది చేరేవరకు తప్పక బ్రతుకు.. తల ఎత్తుకు బ్రతుకు … తల ఎత్తుకు బ్రతుకు…

03.12.2008:
people‘ always consists of headless bodies and bodiless heads. ‘civilisation‘ is defined by their proportion and ‘change‘ by the number of bodies with head.

‘civil defence’ could be a solution to terrorism and its sleeper cells.

09.01.2009: dedicated to my muslim/christian friends:
In the end, you will realize you are dying as a human being but neither as a Christian.. nor a Muslim… and then you will remember all your friends who left you because you “belonged” to some religion.

14.1.2009:
fearlessness is not denying fear, but overcoming it to a logical end.

27.1.2009:
Not just criticism, people often dislike suggestions too 😀

1.2.2009:
Why am i a true blend of self-{awareness,confidence,control}, commitment and integrity, ability to communicate and influence, initiate and accept change ?

9.2.2009
Until I realized Discipline is a process of condemnation and comparison, I couldn’t liberate myself.

Thoughts & Feelings: You can only start them but not stop.
Friends & Relations: You can only stop them but not start.

5 Comments

5 thoughts on “Book of Balu

  1. Sailaja

    Too good Balu. U r becoming poet

  2. హా…. చాలా బాగుంది అన్నా…తత్వం మీద నీ కవిత్వం… 🙂 ఇంకా మంచి మంచివి రావాలి 🙂

    -స్వాప్నిక్.

  3. vry nice so matured. keep going. keep the same pace. may i use ur things personally ?

  4. advice about love

    Wow, wonderful blog layout! How long have you been blogging for?
    you made blogging look easy. The overall look
    of your website is wonderful, let alone the content!

  5. Shekar

    I had not visited your blog in a long time. I wanted to see more recipes but I found a lot more.
    It is refreshing.

    – Shekar

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: